తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్ దూకుడు.. 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలు.. నెక్స్ట్​ అణు పరీక్షలే! - ఉత్తర కొరియా korea

North Korea missile tests: వరుస క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా విజృంభించింది. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు.

north-korea-missile-tests
north-korea-missile-tests

By

Published : Jun 5, 2022, 11:16 AM IST

Updated : Jun 5, 2022, 9:07 PM IST

North Korea missile tests: ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. వరుస బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టింది. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రాజధాని ప్యాంగాంగ్​కు సమీపంలోని సునన్ ప్రాంతంలో ఈ ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కరోజులో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అణు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

అమెరికాకు హెచ్చరికగానే ఈ క్షిపణి పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. 2017 తర్వాత విన్యాసాల్లో ఓ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

అయితే, తాజా క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనే విషయంపై సమాచారం లేదని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. దీనిపై చర్చించడానికి జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొన్నారు. మరోవైపు, జపాన్ సైతం కిమ్ దూకుడుపై ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ప్రయోగాల గురించి వీలైనంత సమాచారాన్ని సేకరించాలని ప్రధాని ఫ్యుమియో కిషిదా అధికారులను ఆదేశించారు. విమానాలు, నౌకలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా ఇండోపసిఫిక్ కమాండ్.. అమెరికా భూభాగానికి, పౌరులకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది.

తాజా ప్రయోగాలు 2022లో ఉత్తర కొరియా నిర్వహించిన 18వ క్షిపణి పరీక్షలు కావడం గమనార్హం. ఇందులో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు సైతం ఉన్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత ఈ తరహా పరీక్షలు చేపట్టింది ఉత్తర కొరియా.

ఇదీ చదవండి:

Last Updated : Jun 5, 2022, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details