Man with penis on arm: అసంభవం అనిపించే సంఘటన ఇది.. వైద్య చరిత్రలోనే ఊహించని పరిణామమిది.. ఓ వ్యక్తి పురుషాంగం అతడి శరీరం నుంచి ఊడిపడటం అసంభవం అనిపించేదైతే.. కృత్రిమ పురుషాంగం తయారుచేసి బాధితుడికి అమర్చడం వైద్య చరిత్రలో అరుదైన పరిణామం. వివరాల్లోకి వెళితే...
Malcolm Macdonald story:న్యూయార్క్‌కు చెందిన మాల్కమ్ మాక్‌డొనాల్డ్(47)కు 2010లో అరుదైన ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ సోకి శరీరంలోని రహస్య భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలోనే పురుషాంగం ఊడిపోయింది. ఎంతో బాధతో వైద్యుల వద్దకు వెళ్లిన మాల్కమ్.. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. సర్జన్లు ఎంతో క్లిష్టమైన, సుదీర్ఘమైన చికిత్సకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఊడిపోయిన పురుషాంగం స్థానంలో కొత్త అంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే అంగాన్ని అతడి శరీరంపైనే పెంచాలని భావించారు. దీంతో ఎడమ చేతిపై కొత్త పురుషాంగాన్ని తయారు చేశారు.
Malcolm Macdonald penis arm:తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే.. ఈ పురుషాంగాన్ని చేతి నుంచి తొలగించి.. సర్జరీ ద్వారా కాళ్ల మధ్యలో అమర్చడం. అయితే, ఇక్కడే మాల్కమ్‌ను దురదృష్టం వెంటాడింది. సర్జరీ మొదలైనప్పటికీ.. అనివార్య కారణాలతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆపరేషన్ జరుగుతుండగా.. మాల్కమ్ శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. అలాగే చికిత్స కొనసాగిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని భావించిన వైద్యులు.. సర్జరీని నిలిపివేశారు. దీంతో ఆ పురుషాంగం చేతికే ఉండిపోవాల్సి వచ్చింది.