తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రైలు ప్రమాదం.. ఒకరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు - నెదర్లాండ్స్​ లేటెస్ట్ న్యూస్

ఓ ప్యాసింజర్ రైలు.. ట్రాక్​పై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీకొట్టడం వల్ల పట్టాలు తప్పింది. వెంటనే బోగీలో మంటలు చెలరేగగా.. ఒకరు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నెదర్లాండ్స్​లో జరిగింది. మరోవైపు, పపువా న్యూగినియాలో సంభవించిన భూకంపం కారణంగా నలుగురు మృతి చెందారు.

Netherlands train accident
Netherlands train accident

By

Published : Apr 4, 2023, 9:24 AM IST

Updated : Apr 4, 2023, 11:26 AM IST

నెదర్లాండ్స్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం వేకువజామున హేగ్​ నగరానికి సమీపంలోని ఊర్​షోటెన్ గ్రామం వద్ద ఓ ప్యాసింజర్ రైలు.. ట్రాక్​పై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీకొట్టడం వల్ల పట్టాలు తప్పింది. వెంటనే మొదటి బోగీ పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. రెండో బోగీ పక్కకు పడిపోయింది. చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే.. రైల్లోని వారు వెంటనే మంటలు ఆర్పేశారు.

ప్రమాద సమయంలో ప్యాసింజర్​ ట్రైన్​లో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా లైడెన్, హేగ్‌లోని ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు డచ్ రైల్వేశాఖ ట్వీట్ చేసింది.
అంతకుముందు.. ప్యాసింజర్​ రైలును మరో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టిందని వార్తలొచ్చాయి. అయితే.. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనలేదని కాసేపటికి అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల రైలు.. పట్టాలపై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీకొట్టడం వల్లే ఇలా జరిగిందని తెలిపాయి.

పపువా న్యూగినియాలో భూకంపం..
పపువా న్యూగినియాలో సోమవారం భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా నలుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. దాదాపు 300 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 7 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు తెలిపారు. చాంబ్రి సరస్సు వద్ద భూకంప కేంద్రం సమీపంలో భూమిలో లోతైన పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు భూకంప కేంద్రం చుట్టూ ఉన్న 23 గ్రామాలు నష్టపోయాయని అధికారులు తెలిపారు.

గ్రీస్​లో రైలు ప్రమాదం..
ఈ ఏడాది ఫిబ్రవరి 28న గ్రీస్​లో జరిగిన రైలు ప్రమాదంలో 57 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రైళ్ల శకలాలను భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి దేశవ్యాప్తంగా ప్రజలు పూల బొకేలతో సంతాపం ప్రకటించారు. కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు.

ఏథెన్స్‌ నుంచి థెసాలోన్కికి వెళ్తున్న ఓ ప్యాసింజర్​ రైలు.. రాత్రి వేళ తెంపీ ప్రాంత సమీపంలో ఓకే ట్రాక్​పై ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్​ ట్రైన్​ మొదటి మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. మిగతా బోగీలన్నీ పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో ప్యాసింజర్​ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 200 మందిని కాపాడినట్లు పేర్కొన్నారు.

Last Updated : Apr 4, 2023, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details