తెలంగాణ

telangana

ETV Bharat / international

భారీ పేలుడు శబ్దం..​ విమానం మాయం.. 22 మంది పరిస్థితి? - కూలిన విమానం

Nepal Plane Crash: నేపాల్​లో ఆచూకీ గల్లంతైన విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. పర్వత శ్రేణుల్లోని లమ్​చే నది వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించిందని, అక్కడే కూలిపోయి ఉంటుందని ఆర్మీకి సమాచారం అందించారు స్థానికులు. విమానం కూలిపోయిందని భావిస్తున్న ప్రదేశంలో.. మంచు కురుస్తున్న కారణంగా శోధన, సహాయక చర్యలను ఈరోజుకు నిలిపివేశారు.

Nepal plane that went missing with 22 on board found after several hours
Nepal plane that went missing with 22 on board found after several hours

By

Published : May 29, 2022, 5:04 PM IST

Updated : May 29, 2022, 6:14 PM IST

Nepal Plane Crash: 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన విమానం.. నేపాల్​ ముస్టాంగ్​లోని కోవాంగ్​ గ్రామంలో పడిపోయిందని తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్​ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానం కూలిపోయిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నట్లు త్రిభువన్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ చీఫ్​ అన్నారు. విమానం కూలిందని భావిస్తున్న ప్రదేశంలో మంచు కురుస్తున్న కారణంగా.. శోధన, సహాయక చర్యలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే విమానం కూలిపోయిందని స్థానికులు.. నేపాల్​ సైన్యానికి సమాచారం అందించారు. మనపథి హిమల్​ పర్వత శ్రేణుల్లోని లమ్​చే నది వద్ద విమానం కూలిపోయినట్లు స్థానికులు తెలిపారని పేర్కొన్నారు ఆర్మీ ప్రతినిధి నారాయణ్​ సిల్వాల్​.

ఏదో అసాధారణ భారీ శబ్దం వినిపించిందని టిటి ప్రాంత ప్రజలు సమాచారం అందించినట్లు తెలిపారు ముస్టాంగ్​ డీఎస్​పీ రామ్​ కుమార్​ దని. గల్లంతైన విమానాన్ని వెతికేందుకు సమాచారం అందిన వెంటనే రెండు ప్రైవేటు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది నేపాల్​ హోం శాఖ. ముస్టాంగ్​, పొఖారా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు.. నేపాల్​ ఆర్మీ చాపర్​ ఎంఐ-17 సైతం మోహరించినట్లు తెలిపారు హోంశాఖ ప్రతినిధి ఫదింద్ర మని​.

నేపాల్​ తారా ఎయిర్​లైన్స్​కు చెందిన 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు సహా మొత్తం 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్​ వెళ్తుండగా విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో లేటే ప్రాంతానికి చేరుకున్న అనంతరం.. విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:రష్యా హైపర్​సోనిక్​ క్షిపణి ప్రయోగం.. అమెరికా యుద్ధ విమానాలే లక్ష్యం!

బ్రెజిల్​లో వరదల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 31మంది మృతి!

Last Updated : May 29, 2022, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details