Ukraine NATO: ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో.. సైనిక, మానవతా సాయం అందించే అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నాటో కూటమి పేర్కొంది. యుద్ధం ఎంత సుదీర్ఘకాలం సాగినా, తాము ఆ దేశానికి అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. త్వరలో నాటో విదేశాంగమంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో నాటో ప్రమాణాలకు అనుగుణంగా ఉక్రెయిన్ సైన్యాన్ని ఆధునికీకరిస్తామని అన్నారు. రష్యాతో చర్చలు చేయాలని కూడా తాము ఉక్రెయిన్‌పై ఒత్తిడి తేవడం లేదని తెలిపారు.
'ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు' - nato ukraine support
ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో సైనిక, మానవతా సాయం అందించే అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంది నాటో కూటమి. యుద్ధం ఎంత సుదీర్ఘకాలం సాగినా, తాము ఆ దేశానికి అండగా నిలుస్తామని స్పష్టం చేసింది.
nato-will-stay-with-ukraine
"చాలా యుద్ధాలు చర్చలతో ముగుస్తాయి. కానీ చర్చల్లో ఏం జరుగుతుందన్నది యుద్ధక్షేత్రంలోని పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల శాంతియుత పరిష్కారానికి అవకాశాలు పెంచటానికి ఉత్తమ మార్గం ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడమే" అని స్టొల్టెన్‌బర్గ్ చెప్పారు.
- శీతాకాలాన్ని ఆయుధంగా వాడుతూ.. ఉక్రెయిన్ ప్రజల జీవితాలను రష్యా దుర్భరంగా మారుస్తోందని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. శుక్రవారం ఆయన కీవ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు 60 మిలియన్ డాలర్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థను అందిస్తామని హామీ ఇచ్చారు.
- మరోవైపు ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంపై రష్యా తన దాడులను ఉద్ధృతం చేసింది. శుక్రవారం జరిపిన వైమానిక, క్షిపణి దాడుల్లో ఖేర్సన్‌లో 10 మంది పౌరులు మృతి చెందారు.
- ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల మాతృమూర్తులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిశారు. ఈ సందర్భంగా నకిలీ వార్తలను నమ్మవద్దని వారిని కోరారు.
- ఇవీ చదవండి:
- కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్.. సముద్రతీర విల్లాలో ఎంజాయ్!
- పుతిన్‌కు ఏమైంది..? రంగులు మారిన చేతులు.. కారణం అదేనా!