తెలంగాణ

telangana

ETV Bharat / international

తిరుగబాటుదారులు, సైన్యం మధ్య కాల్పులు.. 29 మంది మృతి - సన్యాసులను చంపిన మయన్మార్​ జుంటా

మయన్మార్​లో సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో 29 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు.

myanmar-military-junta-kills-29-at-monastery
జుంటాకు తిరుగబాటుదారులకు మధ్య కాల్పులు

By

Published : Mar 15, 2023, 10:12 PM IST

Updated : Mar 15, 2023, 10:34 PM IST

మయన్మార్​లో తిరుగుబాటు దారులకు, సైనిక మద్దతు గల జుంటాకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో ఈ కాల్పులు జరిగాయి. శనివారం ఈ ఘటన జరిగినట్లు మయన్మార్ అధికారులు తెలిపారు. ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆదివారం సామాజిక మధ్యమాల్లో విడదలయ్యాయి. రక్తం మడుగులో మృతుల శరీరాలు పడి ఉన్నాయి. అందులో బుద్ధ సన్యాసులు కూడా ఉన్నారు. మఠం సైతం తూటాల రంధ్రాలతో నిండిపోయింది.

మార్చి నెల ప్రారంభంలో సాగింగ్ రీజియన్‌లోని మైన్ము టౌన్‌షిప్‌లో 17 మంది గ్రామస్థులను జుంటా దళాలు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత కొద్ది వారాలకే.. తాజా ఘటన జరిగింది. "మృతులకు గాయపడిన వారికి తల భాగంలో, ఇతర భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. ఇప్పటి వరకు 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన ఏడు మృతదేహాలు ఆశ్రమం వద్దే ఉన్నాయి. వాటిని తీసుకువచ్చేందుకు వీలు కావట్లేదు." అని మయన్మార్​ అధికారులు తెలిపారు.

ఆశ్రమంలో హింసకు ఉగ్రవాద గ్రూపులే కారణమని జూంటా ఆరోపించింది. జుంటాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన తర్వాత మయన్మార్‌లో ఇప్పటి వరకు కనీసం 2,900 మంది దళాల చేతిలో చనిపోయారు. 17,500 మందికి పైగా అరెస్టయ్యారు. వీరిలో చాలా మంది ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలలో పౌరులపై మయన్మార్ సైన్యం సామూహిక హత్యలు, వైమానిక దాడులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడుతుందని తిరుగుబాటు దారులు పదేపదే ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై సైన్యం అణిచివేతకు పాల్పడుదుందని వారు వెల్లడిస్తున్నారు. పౌరులను వీధిలో కాల్చి చంపడం, నిరసనకారులను అపహరించడం చేస్తున్నారని తిరుగుబాటుదారులు ఆరోపణలు చేస్తున్నారు.

గనిలో పేలుడు.. 11 మంది మృతి..
సౌత్​ అమెరికాలోని కొలంబియాలో బొగ్గు గనిలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది గనిలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. కుండినామార్కా ప్రావిన్స్‌లోని సుతాతౌసా మున్సిపాలిటీలో పేలుడు సంభవించింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ప్రాంతం నుంచి నలుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఓ ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వారు వెల్లడించారు. ఇంకా 17 మంది గనిలోనే చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదకర వాయువులు కారణంగానే గనిలో పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

Last Updated : Mar 15, 2023, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details