Myanmar news: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష వేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని పేర్కొంది. అందులో నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ మాజీ చట్టసభ సభ్యుడు, ప్రజాస్వామ్య కార్తకర్తలు ఉన్నారు. గత 50 ఏళ్లలో మయన్మార్‌లో ఇదే మొదటి ఉరిశిక్ష. గతేడాది ఆంగ్‌సాన్ సూకీ నుంచి అధికారాన్ని సైన్యం బలవంతంగా స్వాధీనం చేసుకుంది.
ఉరి తీసిన వారిలో మాజీ చట్టసభ సభ్యుడు పోయో జియా థావ్, ప్రజాస్వామ్య ఉద్యమకారులు కో జిమ్మి, హలా మియా ఆంగ్, ఆంగ్ తురా జా ఉన్నారు. పోయో జియో థావ్ భార్య తన భర్తను ఉరితీసినట్లు తెలియలేదని ప్రముఖ వార్తా పత్రికకు తెలిపింది. ఆంగ్ సాన్ సూకీ పార్టీలో పోయో థావ్ కీలక నేతగా ఉండేవారు. ఈ నలుగురికి జూన్‌లోనే మరణశిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటన చేసింది. దానిపై ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో వ్యతిరేకత వచ్చింది.