రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపులతో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన అజుర్ ఎయిర్ ఏజెడ్వీ 2463 విమానం దక్షిణ గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో శనివారం ఉదయం 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉందని తెలిపారు. ఈ తరుణంలో భారత గగన తలంలోకి ప్రవేశించే లోపే ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు.
గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్థాన్‌కు దారి మళ్లింపు - Moscow flight diverted
రష్యా నుంచి గోవా బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపుతో అజుర్ ఎయిర్‌కు చెందిన ఫ్లైట్‌ను ఉజ్బెకిస్థాన్ డైవర్ట్ చేశారు.
రాత్రి 12.30 విమానంలో బాంబు ఉందని దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు ఈమెయిల్ వచ్చిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే దబోలిమ్ వినాశ్రయం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా గోవా పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను విమానాశ్రయం వద్ద మోహరించారు. ఈ మేరకు వాస్కో డీఎస్పీ సలీం షేక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, ఇదే తరహాలో జనవరి 9న అజుర్ ఎయిర్‌కు చెందిన మాస్కో-గోవా విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్ అయింది. అప్పడు అజుర్ ఎయిర్ కార్యాలయానికి బాంబు ఈ మెయిల్ వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.