తెలంగాణ

telangana

ETV Bharat / international

Morocco Earthquake Today : భూకంపానికి 820 మంది బలి.. మొరాకోలో తీవ్ర విషాదం - మొరాకో భూకంప తీవ్రత

Morocco Earthquake Today
మొరాకోలో భారీ భూకంపం

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 12:37 PM IST

Updated : Sep 9, 2023, 3:23 PM IST

12:33 September 09

Morocco Earthquake Today : మొరాకోలో తీవ్ర విషాదం

మొరాకోలో భారీ భూకంపం

Morocco Earthquake 2023 :ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో సంభవించిన భారీ భూకంపం 820 మందిని బలిగొంది. మరో 672 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. 19 నిమిషాల అనంతరం 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. భూకంపం ధాటికి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అట్లాస్‌ పర్వతాల్లో ఉన్న గ్రామాల నుంచి చారిత్రక నగరం మర్రాకేశ్‌ వరకు భూకంపం తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సృష్టించింది.

Marrakech Earthquake : మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 70 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని.. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట 296 మంది చనిపోయినట్లు, 153 మంది గాయపడినట్లు అధికారులు అంచనా వేసినప్పటికీ.. కొద్ది గంటల్లోనే ఆ సంఖ్య భారీగా పెరిగింది.

అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడం వల్ల ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. మొబైల్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లు కూడా స్తంభించాయి. రహదారులు దెబ్బతిని అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి. మొరాకో ప్రజలు భూకంపం విలయానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
మొరాకోలో ఇంతటి భారీ భూకంపాలు సంభవించడం చాలా అరుదు. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 1960లో మొరాకోలోని అగాదిర్ నగరం సమీపంలో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించి వేలాది మంది మరణించారు.

ప్రధాని మోదీ సంతాపం..
Modi on Morocco Earthquake 2023 : మొరాకోలో భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Modi Biden Bilateral Talks : మోదీ, బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు.. 50 నిమిషాల పాటు సుధీర్ఘ భేటీ.. కీలక రంగాల్లో సహకారానికి ఒప్పందం..

ASEAN Summit 2023 Modi : ' ఈ శతాబ్దం మనది.. పరస్పర సహకారంతో ప్రగతి పథం'

Last Updated : Sep 9, 2023, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details