తెలంగాణ

telangana

ETV Bharat / international

Modi Greece Visit : '9 ఏళ్లలో భూమి-చంద్రుడి మధ్య దూరమంత రోడ్లు వేశాం'.. ప్రవాస భారతీయులతో మోదీ

Modi Greece Visit : చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్​ రికార్డు సాధించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. గ్రీస్​లో పర్యటిస్తున్న ఆయన.. అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

Modi Greece Visit
Modi Greece Visit

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 10:45 PM IST

Updated : Aug 25, 2023, 10:58 PM IST

Modi Greece Visit : చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్​ రికార్డు సాధించిందన్నారు. గ్రీస్​లో పర్యటిస్తున్న ఆయన.. అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. గత 9 ఏళ్లలో భారత్​లో సాధించిన ప్రగతిపై ప్రవాసీయులకు వివరించారు. 2014 నుంచి సుమారు 25 లక్షల కిలోమీటర్ల దూరం ఆప్టికల్ ఫైబర్​ కేబుల్ వేశామని తెలిపారు. ఇది భూమి-చంద్రుడు మధ్య దూరం కన్నా ఆరు రెట్లు ఎక్కువని చెప్పారు. దాదాపు 700 జిల్లాలో 5జీ టెక్నాలజీని రికార్డు సమయంలో అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు.​

"ఈ రోజుల్లో చంద్రుడు హాట్ టాపిక్​గా మారింది. ఈ క్రమంలోనే ఓ ఉదాహరణ మీకు చెప్తాను. గత 9 ఏళ్లలో భారత్​లో భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరమంత రోడ్లు వేశాం. కరోనా సమయంలో ప్రపంచానికి భారత్​ వ్యాక్సిన్​ను అందించి అనేక ప్రాణాలను కాపాడింది. త్వరలోనే భారత్​లో జీ20 దేశాల సదస్సు జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకే కుటుంబం, ఒకే భూమి, ఒకే భవిష్యత్తు. ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు భారత్​లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే కొన్ని ఏళ్లలో భారత్​ మూడో దేశంగా మారుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రీస్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకింతం చేస్తున్నాను. గ్రీస్​ కార్చిచ్చు చెలరేగి అనేక మంది పౌరులు మరణించారు. వారందరికీ నా సానుభూతి వ్యకం చేస్తున్నాను."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

PM Modi in Greece : ప్రధానమంత్రి మోదీతో సెల్ఫీలు దిగేందుకు ప్రవాస భారతీయులు పోటీ పడ్డారు. అనంతరం ఇస్కాన్​ సంస్థ గ్రీస్ అధిపతి గురు దయానిధి దాస్​తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత్​కు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు ఉదయం గ్రీస్​కు చేరుకున్న​ ఆయనకు ఏథెన్స్‌లో ఘన స్వాగతం లభించింది. మోదీని చూసేందుకు.. అక్కడి భారతీయులు భారీగా ఎయిర్‌పోర్టుకు తరలివెళ్లారు. డ్రమ్ములు వాయిస్తూ.. వందేమాతరం నినాదాలు చేయగా.. ఏథెన్స్​ మార్మోగింది. వారిని ప్రధాని ఆత్మీయంగా పలకరిస్తూ.. సెల్ఫీలు దిగుతూ కరచాలనం చేశారు. గ్రీకు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. గత 40 ఏళ్లలో గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది. కాగా.. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చివరిసారిగా గ్రీస్‌లో పర్యటించారు.

PM Modi Gets Highest Civilian Award : మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం

Modi Jinping BRICS : 'సరిహద్దును గౌరవిస్తేనే చైనాతో సాధారణ సంబంధాలు'.. జిన్​పింగ్​కు మోదీ స్పష్టం

Last Updated : Aug 25, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details