Ukraine helicopter crash : ఉక్రెయిన్‌లో హెలికాప్టర్ కూలి ఆ దేశ హోంమంత్రి సహా మొత్తం 18 మంది మరణించారు. డిప్యూటీ హోంమంత్రి, ఆ శాఖ కార్యదర్శి సహా ముగ్గురు పిల్లలు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. కీవ్ శివార్లలో బ్రోవరీ ప్రాంతంలోని ఓ కిండర్‌గార్టెన్ దగ్గర బుధవారం జరిగిందీ ఘటన.
ఈ ప్రమాదంలో మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ, హోంశాఖ సహాయ మంత్రి యెవెన్ యెనిన్, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరి లుబ్కోవిచ్ మృతి చెందారని ఉక్రెయిన్ నేషనల్ పోలీస్ చీఫ్ ఇహోర్ క్లైమెన్కో తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీని వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్ ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్ "ప్రమాదం జరిగిన సమయంలో కిండర్ గార్టెన్‌లో పిల్లలు, సిబ్బంది ఉన్నారు. అక్కడే హెలికాప్టర్ కూలింది. దీంతో ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. మొత్తం 15 మంది పిల్లలతో సహా 29 మంది గాయపడ్డారు. అక్కడి స్కూల్‌ను మొత్తం ఖాళీ చేయించాం." అని అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదంపై ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా విచారం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సెషన్‌కు హాజరైన ఆమె.. ప్రమాదం గురించి తెలుసుకుని కన్నీరు పెట్టుకున్నారు. సమావేశం ప్రారంభించే ముందు సభ్యులంతా 15 సెకన్ల పాటు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించారు.
ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్ ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్ ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్ ఉక్రెయిన్‌లో ప్లే స్కూల్ వద్ద కూలిన హెలికాప్టర్