తెలంగాణ

telangana

ETV Bharat / international

Mexico Crash Today : ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి - కాలిఫోర్నియాలో రెండు కార్లు ఢీ

Mexico Crash Today : ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 26 మంది మరణించారు. ఈ ప్రమాదం ఆదివారం మెక్సికోలో జరిగింది.

accident in mexico
ట్రక్కు- వ్యాన్ ఢీ

By

Published : May 15, 2023, 7:06 AM IST

Updated : May 15, 2023, 8:15 AM IST

Mexico Crash Today : మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదంలో 26 మంది మరణించారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్‌ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. పరిమితికి మించి సరుకు రవాణా చేయటం వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయని పోలీసులు పేర్కొన్నారు. సరకు రవాణా ట్రక్కును లాగుతున్న వాహనం ఘటన స్థలంలో లేదు. దీంతో డ్రైవర్ పరారయ్యి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

చిన్నారులు సహా ముగ్గురు మృతి
అమెరికా దక్షిణ కాలిఫోర్నియా హైవేపై వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 7.30 గంటల సమయంలో వైట్‌వాటర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రివర్‌సైడ్ కౌంటీ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.

హజ్ యాత్రలో విషాదం.. బస్సులో మంటలు 20 మంది మృతి
ఈ ఏడాది మార్చిలోనూ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియాలో బ్రేకులు ఫెయిల్ అయిన బస్సు వంతెనను ఢీకొట్టింది.
ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 29 మందికి గాయాలైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. నైరుతి రాష్ట్రమైన యాసిర్​లో ఈ ఘటన జరిగింది. యెమెన్ సరిహద్దులో ఈ రాష్ట్రం ఉంది. బస్సు ప్రమాదానికి గురికాగానే బోల్తా పడిందని సౌదీ మీడియా వెల్లడించింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయని తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారని అల్ ఎఖ్​బరియా అనే టీవీ ఛానెల్ వెల్లడించింది. బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్లు ఆ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఘటన జరిగిందని అల్ ఎఖ్​బరియా టీవీ వెల్లడించింది. అదుపుతప్పి వంతెనను బస్సు ఢీకొట్టిందని పేర్కొంది.

బస్సులోని ప్రయాణికులంతా హజ్ యాత్రికులేనని తెలుస్తోంది. వీరంతా మక్కాకు వెళ్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఘటన గురించి తెలియగానే స్థానియ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకొన్న సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. రెడ్ క్రెసెంట్ వంటి ఎమర్జెన్సీ సేవల సంస్థలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
రంజాన్ మాసం తొలి వారంలోనే ఈ ఘటన జరగిన నేపథ్యంలో స్థానికంగా విషాదం నెలకొంది. రంజాన్ నెలలో అక్కడి ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు.

Last Updated : May 15, 2023, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details