Mexico Bus Crash :దక్షిణ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. మృతులంతా వెనిజులా, హైతీకి చెందిన వలసదారులేనని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
Mexico Bus Accident : ఈ ఘటనలో మృతుల సంఖ్య తొలుత 18 అని మెక్సికో నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించగా.. ఆ తర్వాత 16గా తెలిపింది. మృతదేహాలను లెక్కించడంలో తప్పు జరిగిందని వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. 29 మంది గాయపడ్డారని.. వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదని చెప్పింది. వెనిజులా నుంచి వచ్చిన మొత్తం 55 మంది వలసదారులు వాహనంలో ఉన్నారని తెలిపింది.
గత వారం గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చియాపాస్‌లోని హైవేపై వలసదారులు ప్రయాణిస్తున్న సరుకు రవాణా ట్రక్ ప్రమాదానికిగురికావడం వల్ల 10 మంది క్యూబా వలసదారులు మరణించారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వలసదారులందరూ మహిళలేనని, వారిలో ఒకరు 18 ఏళ్లలోపు ఉన్నారని నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. 27 మంది వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కును డ్రైవర్ వేగంగా నడుపుతూ నియంత్రణ కోల్పోయాడని చెప్పింది.
హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. చిన్నారులు సహా 17 మంది మృతి..
Mexico Bus Accident : ఆగస్టు నెలలోనూ మెక్సికోలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. నయరిట్ రాష్ట్రంలో మెక్సికో కాలమాన ప్రకారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి..
Mexico Bus Crash : అంతకు ముందు కూడా మెక్సికోలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. బస్సు అదుపుతప్పి లోయలో పడటం వల్ల ఈ దారుణం జరిగింది. ఓక్సాకా రాష్ట్రంలోని మిక్స్‌టెకా ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. చనిపోయిన వారిలో సంవత్సరన్నర చిన్నారి కూడా ఉంది. డ్రైవర్‌కు అనుభవం లేకపోవడం, అలసటే ప్రమాదానికి కారణంగా తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.