అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫేస్‌బుక్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా చర్చలు జరుపుతోంది. ట్రంప్ ఖాతాపై గతంలో ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన ఎలాన్ మస్క్ ఆ నిషేధాన్ని ఎత్తివేయాలా? వద్దా? అని పోలింగ్ నిర్వహించారు. ప్రజామోదం మేరకు ఆ నిషేధాన్ని ఎత్తివేసి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. దీంతో ఫేస్‌బుక్ కూడా నిషేధాన్ని ఎత్తివేస్తుందన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. ఆ విషయంపై జనవరి 7లోగా నిర్ణయం తీసుకుంటామని మెటా ప్రకటించింది.
ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్ రీఓపెన్.. ఆలోపు నిర్ణయం తీసుకోనున్న మెటా - ట్రంప్ ట్విట్టర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా నిషేధంపై.. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్.. ఫేస్‌బుక్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని జనవరి 7వ తేదీలోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్
పబ్లిక్ పాలసీ, కంటెంట్ పాలసీ నిపుణులతో సమీక్ష బృందాన్ని ఏర్పాటు చేసిన మెటా.. ఆ నివేదిక ప్రకారం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తిరిగి ట్విట్టర్‌కు తిరిగి రానని స్పష్టం చేశారు. కాగా అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ విద్వేష ప్రసంగాలు చేసి దేశ సమగ్రతను దెబ్బతీసే పోస్టులు పెట్టినందుకే ఆయన ఖాతాలపై సామాజిక సంస్థలు నిషేధం విధించాయి.