Fuel Price Hike: క్షీణించిన ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ఇప్పుడు మరింత భారం పడే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ (ఓజీఆర్ఏ) సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని, ఇందులో భాగంగా లీటరు పెట్రోల్‌పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇతర చమురు ఉత్పత్తులపైన కూడా ధరలు భారీగా పెరగనున్నాయి. లైట్ డీజిల్‌పైన రూ.77.31, కిరోసిన్పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్‌పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్ఏ ప్రతిపాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.