తెలంగాణ

telangana

ETV Bharat / international

సూపర్​ మార్కెట్​లో దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి - firing

Mass shooting at New York: అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత మోగింది. న్యూయార్క్​లోని ఓ సూపర్​ మార్కెట్​లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తూటాలు తగిలాయి.

Mass shooting at New York
సూపర్​ మార్కెట్​లో దుండగుడి కాల్పులు

By

Published : May 15, 2022, 6:31 AM IST

Mass shooting at New York: అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

దుండగుడి కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు జో బైడెన్. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్​బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతివిద్వేషమే కారణంగా భావిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details