Man Living in Airport: 'ద టెర్మినల్'.. సినిమా చూశారా? దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్బెర్గ్ దర్శకత్వంలో ప్రఖ్యాత నటుడు టామ్ హ్యాంక్స్ హీరోగా 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రమది. స్వదేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తి, పాస్‌పోర్ట్ చెల్లకుండా పోయి, 18 ఏళ్లపాటు పారిస్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి జీవిత కథ స్ఫూర్తిగా తీసిన సినిమా. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి కథే. కానీ.. ఇక్కడ 'హీరో' 14ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లో ఉంటున్నాడు. అందుకు కారణం రాజకీయ సంక్షోభం కాదు.. 'ఇంటి పోరు'.
14ఏళ్లుగా ఎయిర్‌పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..! విమానాశ్రయమే ఇల్లు: చైనా బీజింగ్‌కు చెందిన వీ జియాంగువో వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు. ఒకప్పుడు వాంగ్జింగ్లోని తన సొంత ఇంట్లో కుటుంబసభ్యులు అందరితో కలిసి సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా జీవించేవాడు. 40+ ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయాడు. ఆ నైరాశ్యంలో తాగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు మద్యం, సిగరెట్లకు బానిసైపోయాడు. తన భార్యకు, ఇతర కుటుంబసభ్యులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు పదేపదే జియాంగువోకు చెప్పేవారు. చివరకు వారికి ఓపిక నశించింది. ఇంట్లో ఉండాలంటే మందు, సిగరెట్ మానేయాల్సిందేనని తెగేసి చెప్పారు.
14ఏళ్లుగా ఎయిర్‌పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..! China Man Airport: ఆ రెండు అలవాట్లు మానే ఆలోచన జియాంగువోకు ఏమాత్రం లేదు. అందుకే తన మకాం మార్చేశాడు. సూట్ కేసు సర్దుకుని బీజింగ్ విమానాశ్రయానికి షిఫ్ట్ అయిపోయాడు. "నేను ఇంటికి వెళ్లాలంటే ఇప్పుడైనా వెళ్లగలను. కానీ వెళ్లను. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేదు. నేను ఇంట్లోనే ఉండాలంటే నాకు వచ్చే పింఛను(1000 యువాన్లు అంటే దాదాపు రూ.12వేలు) మొత్తాన్ని వారికి ఇచ్చేయాలంట. అలా చేస్తే మందు, సిగరెట్లను నేను ఎలా కొనుక్కోగలను?" అని అంటున్నాడు జియాంగువో.
14ఏళ్లుగా ఎయిర్‌పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..! ఒక కుక్కర్.. రెండు సూట్‌కేస్‌లు: అధునాతన వసతులు ఉన్న బీజింగ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్‌లోనే తిరుగుతూ గడిపేస్తుంటాడు జియాంగువో. మొబైల్ కిచెన్ సామగ్రి, దుప్పట్లు, దుస్తుల్ని ఓ రెండు సూట్‌కేసుల్లో పెట్టుకుంటాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్లలో భోజనం చేస్తాడు. మరీ బోర్ కొడితే.. విమానాశ్రయం బయటకు వెళ్లి.. కావాల్సినవి కొనుక్కుని తిరిగి వచ్చేస్తాడు. జియాంగువోను ఎయిర్పోర్ట్ నుంచి పంపించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో అతడి ఇంటి వద్ద విడిచిపెట్టారు. కానీ.. వెంటనే తిరిగి వచ్చేసేవాడు జియాంగువో.
14ఏళ్లుగా ఎయిర్‌పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..! ఇదీ చదవండి:ఉక్రెయిన్ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్ ఎ'పై విషప్రయోగం!