తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా సిల్వా.. స్వల్ప తేడాతో బోల్సోనారో ఓటమి

Brazil New President : బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లూయిజ్ ఇన్​సియో లులా డా సిల్వా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోపై లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన డా సిల్వా విజయం సాధించారు. ఆయన 2023 జనవరి 1న బ్రెజిల్​ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

brazil president
బ్రెజిల్ అధ్యక్షుడు

By

Published : Oct 31, 2022, 9:23 AM IST

Brazil New President : బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోపై లెఫ్టిస్ట్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన 77 ఏళ్ల డా సిల్వా విజయం సాధించారు. బ్రెజిల్‌ అధ‌్యక్ష ఎన్నికల్లో 98.8 శాతం ఓట్లు పోలవ్వగా.. డా సిల్వాకు 50.8 శాతం ఓట్లు వచ్చాయి. 49.2 శాతం ఓట్లు సాధించిన బోల్సోనారో అతిస్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

2003 నుంచి 2010 వరకు డా సిల్వా బ్రెజిల్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అవినీతి కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించిన డా సిల్వాను 2018 ఎన్నికల్లో పోటీ నుంచి పక్కన బెట్టారు. ఆయన 2023 జనవరి 1న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో శాంతిని నెలకొల్పడం డా సిల్వా ముందు ఉన్న అతిపెద్ద సవాల్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపులో తొలి అర్ధభాగంలో ముందంజలో ఉన్న బోల్సోనారో చివరికి అతి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details