తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్వేతసౌధం వద్ద పిడుగు- ముగ్గురు మృతి.. అగ్నిప్రమాదంలో మరో 10 మంది - పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం

WHITEHOUSE LIGHTINING STRIKE: అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు.

white house lightning strike
వైట్ హౌస్​ సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు బలి

By

Published : Aug 6, 2022, 7:34 AM IST

WHITEHOUSE LIGHTINING STRIKE: అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న లఫాయెట్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చెంతనే పిడుగు పడిందని అధికారులు శుక్రవారం తెలిపారు. వీరిలో ఒక మహిళ, పురుషుడు మరణించగా, మరో మహిళ, పురుషుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

పిడుగుపాటు అనంతరం అక్కడకు చేరుకున్న సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పార్క్‌ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముందుజాగ్రత్తగా పార్క్‌లో కొంత భాగాన్ని అధికారులు గంటసేపు మూసివేశారు.

ఒకే కుటుంబానికి చెందిన 10 మంది:
అమెరికా పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి వయసు వరుసగా 5, 6, 7 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. ఇంట్లో మొత్తం 14 మంది ఉండగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇవీ చదవండి:చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'.. ఆంక్షలతో డ్రాగన్​ షాక్.. అమెరికాతో చర్చలు బంద్​

'కరోనా నుంచి కోలుకున్నా.. కష్టంగానే!'

ABOUT THE AUTHOR

...view details