తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో వరదల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 31మంది మృతి! - బ్రెజిల్​ కొండచరియలు

brazil landslide news: బ్రెజిల్​లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 31 మంది మరణించారు. 32వేల కుటుంబాలపై వరద ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు.

brazil landslide news
brazil landslide news

By

Published : May 29, 2022, 7:25 AM IST

Updated : May 29, 2022, 7:48 AM IST

brazil landslide news: బ్రెజిల్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య బ్రెజిల్​లోని పెర్నాంబుకోలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 29 మంది దుర్మరణం చెందగా.. అలగోస్​ పరిధిలో ఇద్దరు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. 1000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు పేర్నొన్నారు. సుమారు 32 వేల కుటుంబాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయాయని చెప్పారు.

నిరాశ్రయుల కోసం రిసిఫ్​ నగరంలోని పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అలగోస్ ప్రభుత్వం రాష్ట్రం​లోని 33 మున్సిపాలిటీల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వరదలపై స్పందించిన ప్రెసిడెంట్​ జైర్​ బొల్సోనారో.. సహాయక చర్యల కోసం భద్రతా దళాలను పంపుతామని తెలిపారు.

ఇదీ చదవండి:చర్చి వద్ద ఘోరం.. తొక్కిసలాటలో 31 మంది మృతి

Last Updated : May 29, 2022, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details