తెలంగాణ

telangana

ETV Bharat / international

Kim Jong Un Train : లగ్జరీ రైల్లో రష్యాకు కిమ్.. పుతిన్​తో భేటీ!.. ఆ అంశంపైనే కీలక చర్చలు - రష్యా పర్యటనకు కిమ్ జోంగ్ ఉన్​

Kim Jong Un Train : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి సిద్ధమైన కిమ్‌-జోంగ్‌-ఉన్‌.. తన విలాసవంతమైన రైలులో ఆ దేశానికి బయలుదేరారు. ఆదివారం మధ్నాహ్యం ఉత్తర కొరియా నుంచి రష్యాకు కిమ్ పయనమయ్యారు. మంగళవారం పుతిన్‌-కిమ్‌ల భేటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

kim-jong-un-russia-tour-by-personal-train-to-kim-jong-un-putin-meeting-2023
రష్యా పర్యటనకు కిమ్ జోంగ్ ఉన్​

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 7:20 AM IST

Kim Jong Un Train :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యేందుకు.. తన విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలుదేదారు ఉత్తర కొరియా నియంత కిమ్‌-జోంగ్‌-ఉన్​. తన వ్యక్తిగత విలాసవంతమైన రైల్లో.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం రష్యాకు పయనమైనట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కాగా మంగళవారం పుతిన్​తో కిమ్‌ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Kim Jong Un Russia Tour :కొంత కాలంగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా.. ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోందనే సమాచారం ఉంది. అందుకే కిమ్‌ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా నిఘావర్గాలు ఇటీవల అంచనా వేశాయి. గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని.. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ జోంగ్‌ ఉన్.. తన ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లారని స్థానిక మీడియాతోపాటు జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీలోనూ కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని మాస్కో అధికారులు కూడా ధ్రువీకరించినట్లు తెలిపాయి. అయితే, దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం, రక్షణశాఖ, అక్కడి నిఘా వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. సైన్యానికి కిమ్ ఆదేశాలు..
Kim Jong Un Putin Meeting 2023 :పుతిన్‌, కిమ్‌ భేటీ ఇదే తొలిసారి కాదు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్తోక్‌లో రష్యా అధ్యక్షుడితో 2019లో కిమ్‌ భేటీ జరిగింది. ఆ సందర్భంలోనూ విలాసవంతమైన రైలులో 20 గంటలు ప్రయాణించి వ్లాదివోస్తోక్‌ చేరుకున్నారు కిమ్. ఈసారి కూడా ఆ నగరంలోనే ఇరు నేతల భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. వ్లాదివోస్తోక్‌లో జరుగుతోన్న ఈస్ట్రన్‌ ఎకానమీ సదస్సులో పుతిన్‌ పాల్గొననున్నందున.. మరోసారి వారిద్దరి భేటీ అక్కడే ఉండనున్నట్లు సమాచారం. అందుకే ప్యాంగాంగ్‌ నుంచి ప్రత్యేక రైలులో కిమ్‌ బయలుదేరినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అన్ని సదుపాయాలు, ఆయుధ కవచం ఉన్న రైలులో ప్రయాణించడం ఉత్తరకొరియా అధినేతలకు అలవాటే. ఇతర దేశాలతో పెద్దగా కలవకపోవడం, భద్రతపరమైన భయాలు దీనికి కారణమని పలువురు చెబుతారు. పుతిన్‌ ఆహ్వానం మేరకే ఉత్తర కొరియా నియంత కిమ్‌-జోంగ్‌-ఉన్.. రష్యాకు వెళ్తున్నారని తెలుస్తోంది.

Putin Kim Jong Un Meeting : పుతిన్​తో కిమ్​ భేటీ!.. వాటిపైనే కీలక చర్చ.. అలా చేయొద్దని సూచించిన అమెరికా

Kim Jong Un Rifle : రైఫిల్‌ గురిపెట్టిన కిమ్‌! అమెరికా, సౌత్​ కొరియా టార్గెట్​!!

ABOUT THE AUTHOR

...view details