తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్ ఎమోషనల్, కంటతడి పెట్టించేలా స్పీచ్, అసలేమైందంటే - కొవిడ్​ పై ఉత్తర కొరియా ప్రెసిడెంట్

ఎప్పుడూ యుద్ధ నినాదాలు, అణు హెచ్చరికలతో మండే అగ్ని గోళంగా ఉండే ఉత్తర కొరియా నియంత కిమ్‌ తన హృద్యమైన ప్రసంగంతో కంటతడి పెట్టించారు. కరోనా వేళ దేశానికి అండగా నిలిచిన ఆర్మీ వైద్యులను ఉద్దేశించి కిమ్‌ చేసిన వ్యాఖ్యలు వారి హృదయాలను హత్తుకున్నాయి. తమ అధ్యక్షుడి మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన వైద్యులు చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చారు. ఇంతకీ అసలు కిమ్‌ ఏం అన్నారు. రణరంగంలోనూ సేవలందించే ఆర్మీ వైద్యులు అంతలా ఎందుకు ఏడ్చారో ఈ కథనంలో చూద్దాం.

kimhttp://10.10.50.85:6060/finalout4/telangana-nle/thumbnail/20-August-2022/16156141_thumbnail_3x2_kim.jpg
కిమ్

By

Published : Aug 20, 2022, 10:56 PM IST

KIM JONG SPEECH: కరోనా విజృంభణ వేళ అండగా నిలిచిన మిలిటరీ వైద్య సిబ్బందిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వారిని అభినందించేందుకు రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో ఏకంగా ఓ భారీ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ వైద్య సిబ్బందిని అభినందనలతో ముంచెత్తారు. కష్టకాలంలో వారు అందించిన సేవల గురించి ప్రస్తావించారు. మీరు చూపిన ధైర్య సాహసాలు అమోఘం అంటూ ప్రశంసించారు. మీ తోడ్పాటు వల్లే కరోనా మహమ్మారిపై ఉత్తర కొరియా విజయం సాధించగలిగిందని మెచ్చుకున్నారు. కిమ్‌ వ్యాఖ్యలతో సభలోని కొందరు వైద్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనా కాలంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఉత్తర కొరియాలో కరోనాను నియంత్రించేందుకు కిమ్‌ జోంగ్‌ కోటి మంది సిబ్బందిని రంగంలోకి దింపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించింది. కరోనా కారణంగా ఒక దశలో కిమ్‌ సైతం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తీవ్రస్థాయిలో జ్వరం వచ్చినట్టు ఆయన సోదరి కిమ్ యో జాంగ్ ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కిమ్ విశ్రాంతి తీసుకోలేదని, ప్రజల్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రెయింబవళ్లు కష్టపడినట్టు ఆమె చెప్పారు. మరోవైపు కరోనాను పూర్తిగా కట్టడి చేశామని ఇటీవల ప్రకటించిన అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఇందుకు కృషిచేసిన వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details