తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధానికి కిమ్‌ 'సై'.. భారీగా ఆయుధాల ఉత్పత్తి.. అమెరికా- సౌత్​ కొరియాకు ఝలక్ ఇచ్చేందుకే! - కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దక్షిణ కొరియా

Kim Jong Un Missile Production : యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తన సైనిక బలగాలను ఇప్పటికే ఆదేశించిన ఉత్తర కొరియా నియంత కిమ్‌.. మరోసారి ఆయుధ స్థావరాలను సందర్శించారు. ఓవైపు వరదలతో దేశం అతలాకుతలం అవుతున్నా.. కిమ్‌ మాత్రం సైనిక సంసిద్ధతను స్వయంగా వెళ్లి మరీ పరీక్షించారు. వచ్చే వారం దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన బలగాలను కిమ్ మరోసారి ఆదేశించారు. పనిలోపనిగా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kim Jong Un Missile Production
Etv Kim Jong Un Missile Production

By

Published : Aug 14, 2023, 3:13 PM IST

Kim Jong Un Missile Production :ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక బలగాలను ఆదేశించిన కిమ్‌.. వాటి సంసిద్ధతను పర్యవేక్షించారు. ఉత్తర కొరియా ప్రధాన ఆయుధాల కర్మాగారాలను సందర్శించి.. క్షిపణులు సహా మిగిలిన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించారు.

ఆయుధ కర్మాగారంలో కిమ్

దక్షిణ కొరియా- అమెరికా ప్రకటన నేపథ్యంలో..
Kim Jong Un Weapons : వచ్చే వారంలో సైనిక విన్యాసాలు ప్రారంభిస్తామని.. దక్షిణ కొరియా- అమెరికా ప్రకటించిన నేపథ్యంలో కిమ్‌ ఆకస్మికంగా ఆయుధ స్థావరాలను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్షిపణులు, మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, సాయుధ వాహనాలు, ఫిరంగి షెల్‌లను ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్‌ సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA తెలిపింది.

అధికారులతో కిమ్​ చర్చలు

'క్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలి'
Weapons Of North Korea :కిమ్‌తో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా ఉన్నట్లు తెలిపింది. క్షిపణి కర్మాగారంలో ఆయుధ కార్యక్రమాలను మరింత పెంచాలని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను కిమ్‌ ఆదేశించారు. ఫ్రంట్ లైన్ మిలిటరీ యూనిట్ల అవసరాలకు అనుగుణంగాక్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలని కూడా ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేశారు.

ఆయుధాలను పరిశీలిస్తున్న కిమ్​

అధికారులపై కిమ్ ఆగ్రహం
North Korea Flooded Areas :మరోవైపు తుపాను ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలను కూడా కిమ్‌ పరిశీలించారు. వరదల హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన విధంగా సిద్ధంకాని అధికారులపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిమ్‌.. అందుతున్న సహాయ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి కీలక సూచనలు చేశారు. వరదల వల్ల దాదాపు 200 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA తెలిపింది.

ఆయుధాలను పరిశీలిస్తున్న కిమ్​

'ప్రజలకు కిమ్ సర్కార్.. ఆహారం అందించలేకపోతుంది'
North Korea Floods : అయితే ఈ వరదలు ఎప్పుడు సంభవించాయి? కిమ్‌ ఎప్పుడు పర్యటించారు? అనే విషయాలను వెల్లడించలేదు. రైతులకు మార్గదర్శకత్వం చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి నష్టం వాటిల్లిందని KCNA తెలిపింది.
ఉత్తర కొరియా తరచుగా ప్రకృతి వైపరీత్యాలకు గురవుతోందని.. దశాబ్దాలుగా ప్రజలకు ఆహారం కూడా అందించలేక పోతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details