Kabul Blast: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక ఖైర్ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్ సహా కనీసం 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కొందరు అధికారులు తెలిపారు.
కాబుల్ ఉత్తరప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాజా దారుణానికి పాల్పడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
మసీదులో భారీ పేలుడు, 20 మంది దుర్మరణం
Kabul Blast సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. కాబుల్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
At least 20 dead, 40 injured in mosque explosion in Kabul
Last Updated : Aug 24, 2022, 10:43 AM IST