Julian Assange Extradition: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు ఈ అప్పగింతకు సంబంధించిన నిర్ణయం బ్రిటన్ హోం మంత్రి ప్రీతిపటేల్ చేతిలో ఉంది. మంత్రి తీర్పునకు అనుకూలంగా వ్యవహరిస్తే.. అసాంజే తరఫు న్యాయవాదులు 14 రోజుల వ్యవధిలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. తాజా తీర్పుతో యూకే కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న అతడి అప్పగింత కేసు చివరిదశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కేసులో అప్పీళ్లకు అవకాశాలు ఉన్నాయి.
అసాంజే అప్పగింతపై కోర్టు కీలక తీర్పు.. హోం మంత్రి చేతుల్లో! - వికీ లీక్స్
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అప్పగింతకు సంబంధించిన తుదినిర్ణయం హోంమంత్రి చేతుల్లో ఉంది. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని, వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది.
పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని, వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. వాటిలో ఆయనకు గరిష్ఠంగా 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే అమెరికా వాదనను అసాంజే తరఫు న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఒక ప్రజావేగుగా అసాంజే అమెరికా సైన్యం ఇరాక్, అఫ్గానిస్థాన్‌లో చేస్తున్న దారుణాలను బయటపెట్టారని, భావప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఆయనకు ఆ అధికారం ఉందని చెబుతున్నారు. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తన దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా ఇదివరకు చేసుకున్న అప్పీల్ తిరస్కరణకు గురైంది. అత్యంత గరిష్ఠ భద్రత కలిగిన యూఎస్ జైల్లో ఉంచడం వల్ల ఆత్మహత్యకు పాల్పడే ముప్పు ఉందని వాదించి, కోర్టు నుంచి అసాంజే ఉపశమనం పొందారు. కానీ అమెరికా తన ప్రయత్నాలు కొనసాగించి అనుకూలంగా తీర్పు పొందింది.
ఇదీ చూడండి :Boris Apology : 'అది పార్టీ అని అనుకోలేదు.. క్షమించండి'