తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఎవరినీ ఫూల్స్ చేయలేరు'.. అమెరికా తీరుపై జైశంకర్​ ఆగ్రహం - అమెరికా తీరుపై జైశంకర్

Jaishankar On US Pakistan Aid: పాకిస్థాన్​కు అమెరికా యుద్ధ పరికరాల సాయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధ పరికరాలు విక్రయాల అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Jaishankar On US Pakistan Aid
Jaishankar On US Pakistan Aid

By

Published : Sep 26, 2022, 11:12 AM IST

Jaishankar On US Pakistan Aid: పాకిస్థాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది. ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

ఇటీవలే పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశమని అగ్రరాజ్యం తెలిపింది.

అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్‌ విఫలమైనందుకు 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు పాకిస్థాన్‌కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపేసింది. తాజాగా జో బైడెన్‌ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్‌ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు బైడెన్‌ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.

ఇవీ చదవండి:చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్​పింగ్​.. వడివడిగా అడుగులు.. ఎన్నిక లాంఛనమే!

మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు.. ఆ దేశాలకు హెచ్చరికగా క్షిపణి పరీక్ష!

ABOUT THE AUTHOR

...view details