Italy Missing Chopper: ఇటలీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్ చాపర్ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి జాడ తెలియలేదు. అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు మరణించినట్లైంది.
హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం
Chopper crash: ఇటలీలో ఓ ప్రైవేటు చాపర్ దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.
హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం
దట్టమైన అడవి కావడం వల్ల హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశాన్ని త్వరగా గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంటా చెట్లు ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తిందన్నారు. మొదట హెలికాప్టర్ కూలిన 10 కిలోమీటర్ల దూరంలో గాలింపు చేపట్టినట్లు చెప్పారు. రాడార్ వ్యవస్థతో సంబంధాలు లేకపోవడం వల్ల హెలికాప్టర్ జాడ కనిపెట్టలేకపోయినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆ పడవల్లో గుట్టల కొద్దీ బంగారం.. విలువ రూ.1.33 లక్షల కోట్లు!