తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇటలీ ప్రధాని రాజీనామా.. 17 నెలలకే ముగిసిన పాలన - ఇటలీ ప్రధాని రాజీనామా

Italy pm resigns: ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మారియో ద్రాగి ధన్యవాదాలు తెలిపారు.

italy political crisis
italy political crisis

By

Published : Jul 21, 2022, 3:18 PM IST

Updated : Jul 21, 2022, 3:38 PM IST

Italy pm resigns: ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేశారు. ఇటలీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఫోర్జా ఇటాలియా, 5-స్టార్‌ మూవ్‌మెంట్‌ విశ్వాస పరీక్షను బహిష్కరించడం వల్ల గురువారం ద్రాగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లాకు రాజీనామా లేఖను అందజేశారు. ఆపధర్మ ప్రధానిగా కొనసాగాలని ద్రాగిని అధ్యక్షుడు కోరారు. గత వారమే రాజీనామాను అందజేసినా.. అధ్యక్షుడు సెర్జియో అప్పుడు తిరస్కరించారు.

శాసనసభ పదవీ కాలం, యూరిపియన్ నిధులతో మహమ్మారి పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కలిసి పనిచేద్దామని ద్రాగి కోరారు. కానీ ఆయన వినతిని భాగస్వామ్య పక్షాలు వినకపోవడం వల్ల 17 నెలల్లోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మారియో ద్రాగి ధన్యవాదాలు తెలిపారు.

ఇటలీలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై స్థానిక మీడియా ఒక్క తాటి పైకి వచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలపై గళం విప్పింది. కనీసం వేతనం, ఆదాయాన్ని ద్రాగి పట్టించుకోకపోవడం వల్ల విశ్వాస పరీక్షను బహిష్కరించామని భాగస్వామ్య పక్షాలు తెలిపాయి.

ఇవీ చదవండి:పుతిన్ ఎదురుచూపులు.. ఎర్డోగన్‌ ప్రతీకారం తీర్చుకున్నారా..?

ప్రధాని రేసులో రిషి ఫుల్​ జోష్​.. ఐదో రౌండ్​లోనూ టాప్​.. ఇంకా ఒక్క అడుగే!

Last Updated : Jul 21, 2022, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details