Israel South Gaza Bombing : కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్ దళాలు తీవ్రతరం చేశాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసినట్లు హమాస్ మిలిటెంట్ సంస్థ తెలిపింది.
'లక్షలాది మంది పాలస్తీనా వాసులు ఎలా ఉంటారు?'
Israel Bombs Southern Gaza : ఖాన్ యూనిస్ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ నగరంలోనూ సిటీ సెంటర్‌ను ఖాళీ చేయాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ సేఫ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతం లండన్ విమానాశ్రయం కంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్న ప్రదేశంలో లక్షలాది మంది పాలస్తీనా వాసులు ఎలా ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హమాస్ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యం!
Israel Strikes South Gaza : గాజా జనాభా 23 లక్షల మందిలో 85 శాతం నిరాశ్రయులుకాగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోంది. హమాస్ మిలిటెంట్ సంస్థను రూపుమాపే లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హమాస్ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు.