తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు వస్తున్న ఇజ్రాయెల్​ నౌక హైజాక్​- హౌతీ రెబల్స్​ పనే- గాజాపై దాడులు ఆపాలని హెచ్చరిక

Israel Ship Hijack Houthi : ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో నౌకను ఆదివారం యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్‌ హైజాక్‌ చేశారు. గాజాపై దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్​కు హెచ్చరికలు జారీ చేశారు.

Israel says Houthis seize ship in Red Sea
Israel says Houthis seize ship in Red Sea

By PTI

Published : Nov 20, 2023, 7:14 AM IST

Updated : Nov 20, 2023, 10:40 AM IST

Israel Ship Hijack Houthi :తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్‌ కార్గో నౌకను ఆదివారం యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్‌ హైజాక్‌ చేశారు. ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్ అనే నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్‌ చేసినట్లు హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. హమాస్​కు వ్యతిరేకంగా గాజాపై దాడులు ఆపేంత వరకు ఇజ్రాయల్​కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

మా దేశ పౌరులు ఎవరు లేరు ఇజ్రాయెల్‌: అయితే హైజాక్ అయిన నౌకలో భారతీయులు, ఇజ్రాయెల్‌ పౌరులు ఎవరూ లేరని.. ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ దళం ధ్రువీకరిస్తూ.. ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇది అంతర్జాతీయ పర్యావసనాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పేర్కొంది. ఆ నౌక తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిందని, అందులోని సిబ్బంది వివిధ దేశాలకు చెందినవారని తెలిపింది. అయితే అందులో ఇజ్రాయెల్‌ పౌరులెవరూ లేరని, అది తమ దేశానికి చెందిన నౌక కాదని IDF స్పష్టం చేసింది.

కార్గో నౌక గెలాక్సీ లీడర్

హౌతీ తిరుగుబాటుదారుల చేతిలో బందీలుగా ఉన్న 25 మంది సిబ్బంది బల్గేరియా, ఫిలిపీన్స్​, మెక్సికో, ఉక్రెయిన్‌ల దేశాలకు చెందినవారిగా గుర్తించారు. పట్టుబడిన సిబ్బందితో హౌతీ ఉగ్రవాదులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఈ చర్యను తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ ఓడ బ్రిటిష్ యాజమాన్యంలోనిదని, నిర్వహణ మాత్రం జపాన్​ చూసుకుంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే పబ్లిక్ షిప్పింగ్ డేటాబేస్‌లలో మాత్రం యాజమాన్య వివరాలు.. ఇజ్రాయెల్‌లోని అత్యంత ధనవంతులలో ఒకరైన అబ్రహం రామి ఉంగర్ పేరుతో ఉన్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ఓడను స్వాధీనం చేసుకున్నారని.. యూఎస్ రక్షణ అధికారులు స్పష్టం చేశారు. తిరుగుబాటుదారులు హెలికాప్టర్ ద్వారా కార్గో షిప్‌పైకి దిగారని వారు తెలిపారు. గత నెలలో రెండుసార్లు US యుద్ధనౌకలు యెమెన్ నుంచి క్షిపణులను అడ్డుకున్నాయని వారు తెలిపారు. ఉత్తర ఎర్ర సముద్రం వైపు హౌతీ దళాలు ప్రయోగించిన మూడు ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులు, అనేక డ్రోన్‌లను.. నేవీ డిస్ట్రాయర్ USS కార్నీ అడ్డగించిందని వివరించారు.

'దక్షిణ గాజా నుంచి పారిపోండి'- పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు

యుద్ధం తర్వాత గాజాను పాలించేదెవరు? కాల్పుల విరమణకు నెతన్యాహూ నో

Last Updated : Nov 20, 2023, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details