తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​ పార్లమెంట్ రద్దు.. మళ్లీ ఎన్నికలు.. మూడేళ్లలో ఐదోసారి - ఇజ్రాయెల్ ప్రభుత్వం రద్దు

Israel parliament dissolve: ఇజ్రాయెల్​లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్​ను రద్దు చేస్తున్నట్లు అక్కడి అధికార కూటమి ప్రకటించింది. మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి ఎన్నికలు జరగనుండటం గమనార్హం.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 20, 2022, 10:32 PM IST

Israel parliament elections: ఇజ్రాయెల్​లో రాజకీయ సుస్థిరతకు మళ్లీ భంగం కలిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ కూటమి.. పార్లమెంట్​ను రద్దు చేసింది. త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నాఫ్తాలీ బెన్నెట్ సైతం ఆ పదవిలో నుంచి దిగిపోనున్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న యాయిర్ లాపిడ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించనున్నారు.

ఎనిమిది పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో బెన్నెట్ విఫలమయ్యారు. కూటమిలో లుకలుకలతో రెండు నెలలుగా పార్లమెంట్​లో మెజారిటీ లేకుండానే అధికారంలో కొనసాగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన చర్చలు పార్లమంట్ రద్దుకు దారి తీశాయి. ఈ మేరకు కూటమి నేతలు అంగీకారానికి వచ్చారు. దేశంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి మూడేళ్ల వ్యవధిలో జరిగే ఐదో ఎన్నికలు కానున్నాయి.

12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమిన్ నెతన్యాహు పాలనకు తెరదించుతూ గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. బెన్నెట్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. సిద్ధాంత పరంగా భిన్నమైన రాజకీయ పార్టీలతో వీరి కూటమి ఏర్పడింది. దీనిలో అరబ్ పార్టీతో పాటు.. అతివాద, వామపక్ష పార్టీలున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details