Israel Palestine Conflict Explained In Telugu :ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్-అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్‌మౌంట్ అత్యంత పవిత్రస్థలం.
గొడవలకు కారణం అదే!
ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మెుదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాలమన్ నిర్మించినది. తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లున్న తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో.. తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయోల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించటానికి 1990లో కొంత మంది యూదు అతివాదులు ప్రయత్నించగా, గొడవలు తీవ్రమయ్యాయి.
1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య.. ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్-అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా.. యూదులు, క్రైస్తవులకు అనుమతించరు. వారు కేవలం.. ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతుంది. అల్-అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ.. చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక యూదు మతసంస్థలు.. తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్-అఖ్సా ప్రాంగణంలో.. ఇజ్రాయోల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి. కొద్దిరోజులు కిందట ఇజ్రాయెల్ భద్రతాదళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో.. అల్-అఖ్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది.
ఏమిటీ హమాస్?
ఆధునాతన ఆయుధాలు, గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢచారులు ఉన్నప్పటికీ.. జ్రాయెల్‌కు ఒక చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాళ్లు రువ్వుతోంది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి.
1987లో స్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలెంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రాంతాల్లో మెుదటి ఇంతిఫదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే మాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు.. రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో తన చార్టర్‌ను ప్రకటించిన హమాస్.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. అందులో ప్రకటించింది.