తెలంగాణ

telangana

ETV Bharat / international

Israel Hamas War Latest : హమాస్ పక్కా ప్లాన్.. ఇజ్రాయెల్​పై దాడికి ముందు గట్టి ప్రాక్టీస్.. కాగితపు బొమ్మలను కాలుస్తూ.. - hamas war practice rehearsal

Israel Hamas War Latest : ఇజ్రాయెల్​పై దాడికి ముందు హమాస్ మిలిటెంట్లు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లు తేలింది. దాడి ఎలా చేయాలో పక్కా ప్లాన్​తో ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

HAMAS PRACTICE VIDEO
HAMAS PRACTICE VIDEO

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 7:38 PM IST

Israel Hamas War Latest :ఇజ్రాయెల్‌పై హమాస్‌ పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు నిర్ధరణ అయింది. ఇందుకోసం వేలమంది హమాస్‌ మిలిటెంట్లకు బహిరంగంగా శిక్షణ ఇచ్చిన వీడియో బహిర్గతమైంది. మెరుపుదాడుల కోసం ప్రత్యేక సాయుధ యూనిట్‌ తయారు చేసిన హమాస్‌... వారికి కఠోర శిక్షణ ఇచ్చినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఆకాశం నుంచి చొచ్చుకొచ్చేందుకు మిలిటెంట్లకు పారా గ్లైడింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అన్ని సిద్ధం చేసుకున్నాకే.. పకడ్బందీగా ప్లాన్‌ను అమలు చేసింది హమాస్‌.

అన్నింటికీ శిక్షణ
Israel vs Hamas :బయటకు వచ్చిన ఈ వీడియోలో మిలిటెంట్లు బహిరంగంగా గాజాలోని ఓ మైదాన ప్రాంతంలో కఠోర శిక్షణ తీసుకోవడం కనిపిస్తోంది. రాకెట్ల శరపరంపర నుంచి భూ, గగనతలాల్లో చొరబాట్లు, బందీలను పట్టుకోవడం వరకు అన్నింటిలో ముందుగానే హమాస్‌ ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారు.

ప్రాక్టీస్​ చేస్తున్న హమాస్ మిలిటెంట్లు
ప్రాక్టీస్​ చేస్తున్న హమాస్ మిలిటెంట్లు

కంచె తొలగించడం.. కాగితాల్ని కాల్చడం..
Israel Hamas War 2023 :ఇజ్రాయెల్‌- గాజా సరిహద్దుల్లో హైటెక్‌ సాంకేతికతతో, చాలా లోతు నుంచి తవ్వి శత్రు దుర్భేధ్యంగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించే శిక్షణ తీసుకోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన తర్వాత పికప్‌ ట్రక్‌లతో ముందుకు సాగడం ప్రాక్టీస్‌ చేశారు. అడ్డువచ్చిన మనుషులపై కచ్చితత్వంతో కాల్పులు జరిపేందుకు వీలుగా కాగితపు బొమ్మలపై షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. దేశంలోకి చొరబడ్డ తర్వాత సమాచారం సైన్యానికి చేరకుండా కమ్యూనికేషన్‌ యాంటెన్నాలను ధ్వంసం చేశారు. నిజంగా శనివారం బయట జరిగిన దాడిలో ఇదే జరిగింది. దాడి అనంతరం బందీలను తీసుకురావడం వ్యూహంలోని కీలకాంశం. ఇందుకూ మిలిటెంట్లు కఠోరమైన శిక్షణ తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.

హమాస్ మిలిటెంట్లు ప్రాక్టీస్ చేసిన ప్రాంతం
ప్రాక్టీస్​ చేస్తున్న హమాస్ మిలిటెంట్లు

పారా గ్లైడింగ్ ప్రాక్టీస్..
Israel Hamas Latest News :రాకెట్లతో దాడి చేసి సైన్యాన్ని ఏమార్చిన తర్వాత.. గ్రౌండ్‌తో పాటు ఆకాశమార్గంలో దేశంలోకి చొరబడేందుకు మిలిటెంట్లు పారాగ్లైడింగ్‌ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంత బహిరంగంగా శిక్షణ కార్యక్రమాలు జరిగినా ఇజ్రాయెల్‌కు దీన్ని పసిగట్టలేకపోయింది. ఈ శిక్షణ, దాడికి సంబంధించిన విషయాలు హమాస్‌లోని కింది స్థాయి నేతలకూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది.

ప్రాక్టీస్​ చేస్తున్న హమాస్ మిలిటెంట్లు

Israel Hostages Killed : 6వేల క్షిపణులతో గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది బందీలు మృతి.. దిల్లీలో హైఅలర్ట్!

Israel Ground Attack On Gaza : '24 గంటల్లో గాజాను వీడండి'.. పౌరులకు ఇజ్రాయెల్​ ఆదేశాలు.. గ్రౌండ్​ ఆపరేషన్​కు రెడీ!

ABOUT THE AUTHOR

...view details