తెలంగాణ

telangana

ETV Bharat / international

Israel Hamas War Effect On Jerusalem : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. యాత్రికులు లేక వెలవెలబోతున్న జెరూసలేం

Israel Hamas War Effect On Jerusalem : ప్రపంచ మూడు ప్రసిద్ధ మతాలకు పవిత్ర స్థలంగా విరజిల్లుతున్న జెరూసలేం ప్రస్తుతం యాత్రికులు లేక వెలవెలబోతుంది. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడె ఈ నగరం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించడం వల్ల జెరూసలేంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొనేలా చేసింది. ఫలితంగా ప్రపంచ స్థాయి పర్యాటక స్థలమైన జెరూసలేంలో వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వ్యాపారాలు లేక ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.

Israel Hamas War Effect On Jerusalem
యాత్రికులు లేక వెలవెల బోతున్న జెరూసలేం

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 9:04 AM IST

Israel Hamas War Effect On Jerusalem :ప్రపంచంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రముఖ నగరంగా విరజిల్లితోన్న జెరూసలేం ఇప్పడు ఎడారిని తలపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న జరిగినహమాస్‌ దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. తర్వాత ఇజ్రాయెల్‌ ప్రతిదాడులలో గాజా దద్దరిల్లుతోంది. అయితే ఈ ప్రభావం నేరుగా జెరుసలేంపైనా పడింది. ఈ పరిస్థితుల వల్ల ఈ నగరానికి సందర్శకులు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఉన్నవారు కూడా ముందు జాగ్రత్తతో ఈ నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. ఫలితంగా నగరంలో పర్యటకులు లేక వ్యాపారాలు జరగక.. దుకాణాలన్నీ మూతపడ్డాయి.

యాత్రికులు లేక వెలవెల బోతున్న జెరూసలేం

నిర్మానుష్యంగా మారిన జెరూసలేం..
ఎప్పుడూ వ్యాపారాలతో కిటికిటలాడె జెరూసలేంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. స్థానికులే అప్పుడప్పుడు అవసరాల కోసం బయటకు వస్తున్నారు తప్ప మరెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెలీలే కాక పాలస్తీనా పౌరులు కూడా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారందరి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది.

పహారా కాస్తున్న సైనికులు
యాత్రికులు లేక వెలవెల బోతున్న జెరూసలేం

యూదులు, క్రైస్తవులు, ముస్లీములే కాక.. ఇతర పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. నిత్యం వేలమంది ఈ ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారులే కాక టూరిస్ట్‌ గైడ్‌లూ జీవనోపాధి కోల్పోయారు. రోజుకు దాదాపు 16 వేల రూపాయలు సంపాదించే గైడ్‌లు ప్రస్తుతం రోడ్డునపడ్డారు. కరోనా సమయంలో ఇలాంటి పరిస్థితులను చూశామనీ మళ్లీ ఇప్పుడే ఆ పరిస్థితులు గోచరిస్తున్నాయని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇజ్రాయోల్‌ సైనిక చర్యలతో తమ జీవితాలు తారుమారయ్యాయని జెరూసలెం ప్రజలు తెలిపారు.

యాత్రికులు లేక వెలవెల బోతున్న జెరూసలేం

ఆగని మారణకాండ.. ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో వేల మంది మృతి..
Israel vs Palestine War : గత కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో మరణ మృదంగం మోగుతోంది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్​ సైన్యం జరుపుతున్న మారణకాండ వల్ల ఇరుదేశాల్లో వేల మంది మరణించారు. మృతి చెందిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. గత కొన్ని దశాబ్దాల్లోనే.. అత్యంత దారుణమైన ఈ ఘటనలతో రెండు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే హమాస్​పై దాడులు మరింత తీవ్రతరం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడింది.

India Help Palestine : పాలస్తీనాకు భారత్ మానవతా సాయం.. ప్రత్యేక విమానంలో గాజాకు 39 టన్నుల సామగ్రి

Israel Vs Hamas War 2023 : ముష్కరులు నక్కిన మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు.. యుద్ధంలోకి హెజ్​బొల్లా.. IDFకు గట్టి వార్నింగ్!

ABOUT THE AUTHOR

...view details