తెలంగాణ

telangana

ETV Bharat / international

అరౌరీ హత్యపై హమాస్ ఆగ్రహం- కాల్పుల విరమణ చర్చలు బంద్- తగ్గేదే లేదన్న మొస్సాద్ - ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

Israel Hamas Ceasefire News : హమాస్ కీలక నేత సలేహ్ అరౌరీ హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్​తో కాల్పుల విరమణ చర్చలను ఆ సంస్థ నిలిపివేసింది. ఈ హత్య ఉగ్రవాద చర్య అని అభివర్ణించింది. హెజ్​బొల్లా గ్రూప్ సైతం ఇజ్రాయెల్​కు హెచ్చరికలు పంపింది. తాము యుద్ధానికి భయపడమని స్పష్టం చేసింది.

israel-hamas-ceasefire-news
israel-hamas-ceasefire-news

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 6:57 AM IST

Israel Hamas Ceasefire News :హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్ మట్టుపెట్టడంపై ఆ సంస్థ ఆగ్రహంగా ఉంది. మిగిలిన బందీల విడుదల కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేసింది. అరౌరీ హత్యను హమాస్ మరో అగ్రనేత ఇస్మాయిల్ హనియే ఉగ్రచర్యతో పోల్చారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ధిక్కరించిందన్నారు. ఈ దాడికి ముందు హమాస్, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అతడి మరణం ఒక రకంగా ఇరాన్​కు ఇబ్బందికరమే.

2015లో అరౌరీని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి సమాచారం అందిస్తే 5 మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని వెల్లడించింది. బీరుట్​లో అరౌరీపై డ్రోన్ దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. తన మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు. దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ పెదవి విప్పలేదు. అయితే ఎటు వంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. హమాస్ అగ్ర నేత హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన నిర్మాణాలు

'మా యుద్ధానికి రూల్స్ ఉండవ్'
మరోవైపు, హెజ్​బొల్లా సంస్థ సైతం ఇజ్రాయెల్​కు హెచ్చరికలు పంపింది. యుద్ధానికి తాము భయపడమని చెప్పుకొచ్చింది. తాము యుద్ధంలోకి దిగితే రూల్స్ ఏవీ ఉండవని హెజ్​బొల్లా నేత సయ్యద్ హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. అరౌరీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని తెలిపారు. ఇరాన్ మాజీ సైనిక జనరల్ ఖాసిం సులేమానీ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన బుధవారం వీడియో ద్వారా ప్రసంగించారు. యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవలేదని అన్నారు. లెబనాన్​పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే తమకు రూల్స్ ఉండవని హెచ్చరించారు.

'ఎక్కడున్నా వేటాడుతాం'
కాగా, హమాస్ నేతలను వదిలేది లేదని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న దాడికి కారణమైన ప్రతి ఒక్క నేతనూ వేటాడతామని మొస్సాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నియా తేల్చి చెప్పారు. హమాస్ నేతలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అంతమొందిస్తామని స్పష్టం చేశారు. అదే తమ లక్ష్యమని అన్నారు. లెబనాన్ రాజధాని బీరుట్​లో హమాస్ అగ్రనేత అరౌరీపై డ్రోన్ దాడి చేసి హతమార్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

హౌతీలకు అమెరికా షాక్- 10మంది తిరుగుబాటుదారులు మృతి- భారత్ హైఅలర్ట్!

ఇజ్రాయెల్ మారణహోమం- ఒక్క రోజులో 187 మంది మృతి- 'ఇలా అయితే 'గాజా' కనుమరుగే'

ABOUT THE AUTHOR

...view details