Israel attack: ఇజ్రాయెల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితుడు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని రద్దీగా ఉండే నగరంలో పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోయాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.
ఇజ్రాయెల్‌లో కాల్పుల కలకలం- ఐదుగురు మృతి - islamic state of group
Israel attack: ఇజ్రాయెల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు మరణించాడు.
![ఇజ్రాయెల్‌లో కాల్పుల కలకలం- ఐదుగురు మృతి ఇజ్రాయెల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14875105-thumbnail-3x2-isra.jpg)
Israel attack
కాల్పులు జరిపిన వ్యక్తి వెస్ట్ బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని.. నాఫ్తాలీ బెన్నెట్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. అరబ్ దేశాలు ఈజిప్ట్, మొరాకో, బెహ్రన్, యూఏఈ కాల్పులను ఖండించాయి. అటు రంజాన్ సమీపిస్తున్న వేళ ఇజ్రాయెల్‌లో కాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పలుచోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు.
ఇదీ చదవండి:వేడుకలో దుండగులు కాల్పులు.. 19 మంది మృతి
Last Updated : Mar 30, 2022, 11:27 AM IST