ఇస్టామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూప్ చీఫ్ అబూ అల్-హసన్ అల్-హషిమీ అల్-ఖురేషీ హతమయ్యాడు. తమ నాయకుడు మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులో అబు అల్-హసన్ స్థానంలో ఐఎస్ కొత్త చీఫ్‌గా అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేని అల్-ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది. ఈ ఆడియో సందేశంలో మాట్లాడిన వ్యక్తి ఉగ్రవాద గ్రూప్ కొత్త చీఫ్ అబూ అల్-హుస్సేన్ అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ సందేశంలో అబూ అల్-హసన్ ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు మరణించాడనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
ఐసిస్ చీఫ్ అబూ అల్ హసన్ ఖురేషీ హతం.. కొత్త అధినేత అతడే..
ఐసిస్ గ్రూప్ చీఫ్ అబూ అల్ హసన్ అల్ హషిమీ అల్ ఖురేషీ హతమయ్యాడు. ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయినట్లు ఐసిస్ వెల్లడించింది.
ISIS CHIEF DEAD
అబూ అల్-హసన్‌కి ముందు ఐసిస్ చీఫ్‌గా వ్యవహరించిన అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ ఫిబ్రవరిలో ఉత్తర సిరియా ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో తనను తాను పేల్చేసుకున్నాడు. అంతకముందు అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ కీలక నేత అబూ బకర్ అల్-బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న అతడి స్థానంలోకి ఖురేషీ వచ్చాడు. తాజాగా అబూ అల్-హసన్ మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.