Iraq Wedding Hall Fire :ఇరాక్‌లోని ఓ పెళ్లి మండపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 114 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. ఉత్తర ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో బుధవారం ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
Iraq Wedding Hall Fire : వెడ్డింగ్ హాల్లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది.. - పెళ్లిమండపంలో అగ్నిప్రమాదం
Published : Sep 27, 2023, 6:13 AM IST
|Updated : Sep 27, 2023, 11:25 AM IST
06:12 September 27
Iraq Wedding Hall Fire : వెడ్డింగ్ హాల్లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది..
Fire At Wedding Hall : ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్లు నినెవే ప్రావిన్స్ గవర్నర్ నజిమ్ అల్ జుబౌరీ వెల్లడించారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టినట్లు, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. మంటలు భారీగా చెలరేగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇరాక్ మీడియా ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్.. ఘటనను ధ్రువీకరించి ప్రాణ నష్టాన్ని ప్రకటించారు. అన్ని సహాయక చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
ప్రధాని స్పందన..
భారీ అగ్నిప్రమాదంపై ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ అల్ సూదానీ స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Iraq Fire Accident : అయితే ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి మండపంలో బాణాసంచా భారీగా కాల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కుర్దిష్ టెలివిజన్ ఛానెల్ అనుమానం వ్యక్తం చేసింది. మంటలు చెలరేగగానే హాల్ పాక్షికంగా కుప్పకూలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. భారీ మంటలకు ధ్వంసమయ్యే నాసిరక మెటీరియల్‌తో ఈ భవనం నిర్మించినట్లు చెప్పారు. పెళ్లి మండపంలో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్లే మంటలు భారీగా వ్యాపించినట్లు కొందరు చెబుతున్నారు.