తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి - ఇద్దరు చిన్నారులు మృతి! - Iran strikes Jaish al Adl base

Iran Strikes Bases Of Terrorist Group in Pakistan in Telugu : ఇరాన్​ సైన్యం, పాకిస్థాన్​లోని బలూచీ మిలిటెంట్ గ్రూప్​ జైష్ అల్​ అదిల్​కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో సదరు స్థావరాలు రెండూ ధ్వంసమయ్యాయి. ఇంతకు ముందు బలూచీ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకార చర్యగానే తాజాగా పాక్​లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

Pakistan condemns of Iran attack
Iran strikes bases of terrorist group in Pakistan

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 7:01 AM IST

Iran Strikes Bases Of Terrorist Group In Pakistan : పాకిస్థాన్‌లోని బలూచీ మిలిటెంట్‌ గ్రూప్‌ జైష్ అల్‌ అదిల్‌కు చెందిన స్థావరాలపై ఇరాన్‌ సైన్యం దాడులు చేసింది. ఈ దాడిలో జైష్ అల్​ అదిల్​కు చెందిన రెండు ప్రధాన కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

దాడి- ప్రతిదాడి
బలూచీ మిలిటెంట్లు అంతకుముందు సరిహద్దు వెంట ఉన్న తమ భద్రత బలగాలే లక్ష్యంగా దాడులు చేశారని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతిచర్యగానే పాకిస్థాన్​లోని జైష్ అల్​ అదిల్​ స్థావరాలపై దాడి చేసింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు బలూచిస్థాన్‌ మంత్రి నిరాకరించారు. పాకిస్థాన్‌ కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ దీనిపై స్పందిస్తుందని తెలిపారు.

తీవ్రంగా ఖండిస్తున్నాం
ఇరాన్ తమ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్​ తమ గగనతలంలోకి వచ్చి చేసిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరాన్ దాడి పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసినట్లుగా ఉందని, దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య చర్చలకు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇరాన్​ దాడులకు పూనుకుందని పేర్కొంది.

జైష్ అల్ అదిల్ అనేది ఒక సున్నీ టెర్రరిస్ట్ గ్రూప్​ అని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్​ ఇరాన్​ దక్షిణ ప్రావిన్స్​లో చాలా యాక్టివ్​గా ఉంది. ఇది గత కొంతకాలంగా ఇరాన్​ భద్రతా దళాలపై అనేక సార్లు దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ దీనిపై ప్రతిదాడులు చేస్తోంది.

ఇరాక్​, సిరియాలపై కూడా
ఇరాక్‌లోని ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌ ప్రధాన కార్యాలయంతో పాటు, సిరియాలోని ఐసిస్‌ శిబిరంపై కూడా దాడి చేసిన ఇరాన్‌, తాజాగా పాకిస్థాన్‌ భూభాగంపైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. గ్రీసు సంస్థకు చెందిన జాగ్రోఫియా అనే నౌక, మాల్టా దేశ పతాకంతో సూయెజ్ కెనాల్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఏ సంస్థా ఇప్పటివరకు బాధ్యత ప్రకటించలేదు. అయితే హౌతీ రెబల్సే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

హౌతీ రెబల్స్ దాడిలో వాణిజ్య నౌక పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రీసు అధికారులు వెల్లడించారు. నౌకలో ఏ సరకూ లేదని తెలిపారు. సిబ్బందిలో 20 మంది ఉక్రెయిన్‌, ముగ్గురు ఫిలిప్పీన్‌ పౌరులు, ఒక జార్జియన్ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మరోవైపు యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం కీలకమైన హౌతీ స్థావరాలను అమెరికన్​ ఫైటర్‌ జెట్లు ధ్వంసంచేసినట్లు సమాచారం.

కిమ్ కటీఫ్- దక్షిణ కొరియాతో మాటలు బంద్- త్వరలో రాజ్యాంగ సవరణ!

అలా మెరిసి ఇలా మాయం- అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ బయటకు- ఇకపై ఆయన కోసమే ప్రచారం!

ABOUT THE AUTHOR

...view details