Iran Protests : హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతూనే ఉంది. వేలమంది మహిళలు నిర్భయంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భద్రతా దళాల అణచివేతలో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ నియంత పాలనకు ముగింపు పలకాలని తెగించి పోరాడుతున్నారు. మూడు వారాలుగా ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ మౌనం వీడారు.
హిజాబ్ ఆందోళనలకు కారణం ఆ రెండు దేశాలే.. మౌనం వీడిన ఇరాన్ సుప్రీం
Iran Protests : హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఈ పరిణామాలపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ మౌనం వీడారు. దేశంలో జరుగుతున్న నిరసనలను ఆయన ఖండించారు.
దేశంలో జరుగుతున్న నిరసనలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు అయతొల్లా అలీ. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ప్లాన్ ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన అమీని మృతిని ప్రస్తావించిన ఆయన.. ఈ ఘటన తమనెంతో కలచివేసిందన్నారు. ఆ ఘటన అనంతరం మొదలైన నిరసనలను మాత్రం ఖండించారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే యువతి సెప్టెంబర్ 16న ప్రాణాలు కోల్పోవడం ఇరాన్‌లో ఆందోళనలకు కారణమైంది.