Iran rocket launch: ఇరాన్‌తో అణు చర్చలు పునఃప్రారంభించేందుకు ఐరోపా సమాఖ్య అంగీకరించిన మరుసటి రోజే దుందుడుకు చర్యలకు పాల్పడింది ఆ దేశం. క్షిపణి వాహక నౌకతో పాటు ఓ రాకెట్‌ను ఇరాన్ ప్రయోగించింది. ఘన ఇంధనంతో ఈ రాకెట్ పనిచేస్తుందని ఆ దేశ మీడియా వెల్లడించింది. సరిగా ఏ సమయంలో రాకెట్‌ను ప్రయోగించిందనేది తెలియలేదు. అయితే, శాటిలైట్ చిత్రాలు, ఎడారిలో లాంఛింగ్ ప్యాడ్ ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇరాన్ రాకెట్ ప్రయోగం... అణు చర్చలకు విఘాతం? - iran nuclear deal
Iran rocket launch: ఇరాన్ రాకెట్ ప్రయోగాలు చేపట్టింది. శాటిలైట్లు మోసుకెళ్లే ఘన ఇంధన రాకెట్‌ను ప్రయోగించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అణు చర్చలపై త్వరలో ప్రతిష్టంభన తొలగిపోనుందనే వార్తల మధ్య ఈ ప్రయోగం చేపట్టింది ఇరాన్.
Iran nuclear talks:'జుల్జనా' రాకెట్ పేరుతో రాకెట్ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇరాన్ గతంలోనే ప్రకటించింది. అయితే, ప్రస్తుతం నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయిందో లేదో తెలియలేదు. ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ శనివారమే ఇరాన్లో పర్యటించారు. నిలిచిపోయిన అణు చర్చలను తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టారు. త్వరలోనే అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతాయని శనివారమే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. గతంలో ఇరాన్ నిర్వహించిన రాకెట్ ప్రయోగాలపై అమెరికా మండిపడింది. తాజా ప్రయోగాలపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: