అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్‌లో భారత సంతతికి చెందిన నలుగురు అపహరణకు గురయ్యారు. ఇందులో ఓ 8 నెలల పసికందు, ఆ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. కిడ్నాప్‌కు గురైనవారిలో తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, కూతురు ఆరూహీ ధేరీతో పాటు అమన్‌దీప్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. నిందితులను ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, దుకాణాలతో రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని తెలిపారు. అనుమానితులు లేదా బాధితులు కనిపిస్తే వారి వద్దకు వెళ్లకుండా అత్యవసర నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
2019లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన తుషార్ ఆత్రే అనే వ్యక్తి కిడ్నాప్‌నకు గురయ్యాడు. అతడ్ని ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తన గర్లఫ్రెండ్ కారులో విగతజీవిగా కనిపించాడు.