ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఇండోనేషియాలో 240 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 226 మందిని సురక్షితంగా కాపాడినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం.. పడవలో మంటలు చెలరేగి 14 మంది మృతి - పడవ ప్రమాదం ఇండోనేషియా
ఇండోనేషియాలో ఓ పడవలో అగ్ని ప్రమాదం జరిగి 14 మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
పడవ ప్రమాదం
కేఎమ్ ఎక్స్‌ప్రెస్ కాంటికా 77 పడవ.. తూర్పు నుసా టెంగ్‌గారా ప్రాంతంలోని కుపాంగ్ నుంచి కలాబాహికి వెళ్తుండగా మంటలు చెలరేగాయి. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఇక్కడ రవాణా కోసం పడవలు తరచుగా ఉపయోగిస్తారు. 2018లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో 167 మంది మరణించారు.
Last Updated : Oct 24, 2022, 10:52 PM IST