పాఠశాలలు సాధారణంగా ఉదయం 8 గంటలు దాటిన తర్వాత తెరుస్తారు. అప్పటికి విద్యార్థులు చక్కగా తయారై సైకిళ్లు, బస్సు మీద స్కూల్‌కు వెళ్తుంటారు. అయితే ఇండోనేసియాలో మాత్రం ఉదయం 5.30 గంటలకే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ఉదయాన్నే స్కూల్లు పెట్టడం సరికాదని అంటున్నారు. మరి ఇంతకీ ఇండోనేసియా ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదయాన్న స్కూళ్లు పెట్టిందో ఓ సారి తెలుసుకుందాం.
టెంగ్పారా ప్రావిన్స్‌లోని కుపాంగ్‌లో 10 ఉన్నత పాఠశాలల్లో ఉదయం 5.30 గంటలకే స్కూళ్లను తెరుస్తోంది. 12వ తరగతి విద్యార్థులు ఈ సమయానికి స్కూల్‌కు రావాలని కండీషన్ కూడా పెట్టారు అధికారులు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గవర్నర్ విక్టర్ లైస్కోడాట్ ప్రకటించిన ఈ పథకం పిల్లల క్రమశిక్షణను మెరుగుపరుస్తుందని అధికారులు చెబుతున్నారు.
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సరికి బాగా అలసిపోతున్నారు. ఇంత ఉదయాన స్కూల్‌కు వెళ్లడం చాలా కష్టం. చీకటిగా ఉన్నప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించను. విద్యార్థుల భద్రతకు హామీ ఏంటి? అంత ఉదయం వేళ వారి ఇబ్బందులు పడుతున్నారు. 16 ఏళ్ల నా కుమార్తె ఉదయం 4 గంటలకు బైక్‌పై స్కూల్‌కు వెళ్తోంది. ఇంటికి వచ్చేసరికి అలసిపోతుంది. వెంటనే నిద్రపోతుంది.