తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్​ అదుపులో 300మంది భారతీయులు! ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే? - పారిస్ అదుపులో భారతీయులున్న విమానం

Indians In France Human Trafficking : 300 మంది భారత ప్రయాణికులు ఉన్న విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు అకస్మికంగా ఆపడం కలకలం రేపుతోంది. మానవ అక్రమ రవాణా పేరుతో విమానాన్ని అధికారులు ఒక్కసారిగా ఆపడం వల్ల ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రయాణికుల భద్రత తమ బాధ్యత అని ప్రకటించింది.

Indians In France Human Trafficking
Indians In France Human Trafficking

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 7:20 AM IST

Updated : Dec 24, 2023, 8:02 AM IST

Indians In France Human Trafficking: మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై పారిస్​లోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫ్రాన్స్ సిబ్బంది తమతో వివరించినట్లు భారత అధికారులు వెల్లడించారు. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించిందని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఫ్రాన్స్​ అదుపులోకి తీసుకున్న విమానం ఇదే

మానవ అక్రమ రవాణా ఆరోపణలతో!
రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రయాణికుల గుర్తింపు పత్రాల తనిఖీ
మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 300 మంది భారత ప్రయాణికులు, సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నామని అలాగే వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. అమెరికా, కెనడాల్లోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా ఆ ప్రయాణికులంతా నికరాగువాకు వెళ్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా యూఏఈలో పని చేస్తుండొచ్చని లెజెండ్ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. తమ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని భావిస్తున్నట్లు తెలిపింది.

హైవేపై కూలిన విమానం- కారు, బైక్​తో ఢీ! 10 మంది మృతి
Malaysia Plane Crash : ఇటీవలే మలేసియాలో చార్టర్​ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది మరణించారు. ఈ ఘటన కౌలాలంపుర్​కు ఉత్తరాన ఉన్న హై​వేపై జరిగింది. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్​ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్​ప్రెస్​ వేపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మరణించారు. పూర్తి వివరాలు కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

విమానాన్ని ఢీకొన్న ట్రాక్టర్​- 24 సర్వీసులు నిలిపివేత- చెన్నైలో ఏం జరిగింది?

వంట నూనె ఇంధనంగా - నింగిలోకి దూసుకెళ్లిన 'వర్జిన్ అట్లాంటిక్​' ఫ్లైట్​​!

Last Updated : Dec 24, 2023, 8:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details