తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి.. 19 మందికి గాయాలు - నేపాల్ రోడ్డు ప్రమాదంలో భారతీయ యాత్రికులు మృతి

Indians Died In Nepal Road Accident : నేపాల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Indians Died In Nepal Road Accident
Indians Died In Nepal Road Accident

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 11:07 AM IST

Updated : Aug 24, 2023, 5:15 PM IST

Indians Died In Nepal Road Accident : నేపాల్​లో ఓ బస్సు బోల్తా పడి భారత్​కు చెందిన ఆరుగురు యాత్రికులతో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. దక్షిణ నేపాల్​లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాఠ్‌మాండూ నుంచి జానక్​పుర్​కు వెళ్తున్న బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు బోల్తాపడిండి. అనంతరం రోడ్డు నుంచి 50 మీటర్ల కిందకు పడిపోయింది. సిమారా సబ్-మెట్రోపాలిటన్ సిటీలోని చురియమై ప్రాంత సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల్లో భారతీయులతో పాటు ఓ నేపాలీ కూడా ఉన్నాడు. ఘటనలో డ్రైవర్​, సహాయక డ్రైవర్​ గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారందరూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను రాజస్థాన్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. చిన్నారులు సహా 17 మంది మృతి..
Mexico Bus Accident : మూడు వారాల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. మెక్సికోలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లోయలో పడ్డ గంగోత్రి యాత్రికుల బస్సు.. ఎనిమిది మృతి..
Bus Accident in Uttarakhand Today : నాలుగు రోజుల క్రితం ఉత్తరాఖండ్​ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి రహదారిపై గన్​గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నారు. వీరంతా గుజరాత్​కు చెందిన వారిగా పోలిసులు గుర్తించారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

North Korea Spy Satellite Launch Fail : మరోసారి విఫలమైన ఉత్తర కొరియా 'స్పై' రాకెట్.. అయినా తగ్గేదేలే!

రష్యా కిరాయి సైన్యం అధినేత ప్రిగోజిన్ దుర్మరణం.. పుతిన్​పై తిరుగుబాటు చేసిన 2నెలలకే..

Last Updated : Aug 24, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details