Nand Mulchandani: అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-సీఐఏలో.. తొలి ముఖ్య సాంకేతిక అధికారి- సీటీఓగా నంద్ మూల్‌చందనీ నియమితులయ్యారు. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం ఉన్న మూల్‌చందనీ ప్రస్తుతం రక్షణ శాఖలో సేవలందిస్తున్నారు. మూల్‌చందనీని సీటీఓగా నియమిస్తున్నట్లు సీఐఏ డైరెక్టర్ డాక్టర్ విలియమ్ జే బర్న్స్ ధ్రువీకరించారు.
అమెరికా నిఘా సంస్థ తొలి సీటీఓగా భారత సంతతి వ్యక్తి - నంద్ మూల్‌చందనీ
Nand Mulchandani: అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-సీఐఏలో తొలి ముఖ్య సాంకేతిక అధికారిగా భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందనీ నియమితులయ్యారు. ఇది గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సీఐఏలోని సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
దిల్లీలోని బ్లూబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1979 నుంచి 1987 వరకు మూల్‌చందనీ విద్యాభ్యాసం చేశారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్, హర్వర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులయ్యారు. సీఐఏను మరింత పటిష్ఠం చేసేందుకు సీటీఓ నియామకం కీలకమని జే బర్న్స్ పేర్కొన్నారు. అందుకు మూల్‌చందనీ సరైన వారని పేర్కొన్నారు. ముఖ్య సాంకేతిక అధికారిగా నియమించడంపై స్పందించిన మూల్‌చందనీ.. ఇది గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సీఐఏలోని సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'ఒమిక్రాన్ ఉప వేరియంట్లతో ప్రమాదమే.. టీకానే శ్రీరామరక్ష'