చైనా సరిహద్దులకు సమీపంలో భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. 18వ ఎడిషన్ యుద్ధ అబ్యాస్ 2022 వినాస్యాలను ఈ నెల ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వీటిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విన్యాసాలను ప్రతి ఏటా భారత్-అమెరికా నిర్వహిస్తాయి. వీటిల్లో రకరకాల వ్యూహాలు, టెక్నిక్‌లను ఇరు దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి. 2021లో ఈ విన్యాసాలను అమెరికాలోని అలాస్కాలో ఉన్న జాయింట్‌బేస్ ఎల్మాండర్ రిచర్డ్స్సన్‌లో నిర్వహించారు.
చైనా బోర్డర్లో భారత్- అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు - భారత్ చైనా సంబంధాలు
చైనా సరిహద్దులకు సమీపంలో భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్తంగా చేపట్టే 18వ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ 2022 వినాస్యాలను ఈ నెల ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా విదేశాంగ శాఖ తిప్పికొట్టింది.
ఈ నెలలో జరగనున్న విన్యాసాల్లో అమెరికా సైన్యంలో సెకండ్ బ్రిగేడ్,భారత్ నుంచి 11వ అస్సాం రెజిమెంట్‌లు పాల్గొననున్నాయి. చైనా సరిహద్దులకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఈ విన్యాసాలు జరగనుండటం గమనార్హం. సంయుక్త లక్ష్యాలను సాధించడంపై వీటిల్లో దృష్టిపెట్టనున్నారు. మానవీయ సాయం, విపత్తు ప్రతిస్పందన కార్యక్రమాలపై దృష్టిపెట్టనున్నారు. కమాండ్ పోస్ట్ ఎక్స్‌ర్‌సైజ్‌లు, నైపుణ్యాలపై చర్చలు జరగనున్నాయి. అంతేకాదు, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్‌లు, లాజిస్టిక్స్ ఆపరేషన్లు, పర్వత యుద్ధ తంత్రం వంటి అంశాలపై సాధన చేయనున్నాయి.
భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలపై గతంలో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది.ఈ విన్యాసాలు సరిహద్దు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. చైనా ప్రకటన భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విదేశాంగ శాఖ అప్పట్లో తిప్పి కొట్టింది. ఇప్పటికే క్వాడ్ దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా సహా 12 దేశాలు యోకుసుకా పేరిట నౌకాదళ విన్యాసాలు చేపట్టాయి.