తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​కు భారత్ షాక్... క్షిపణి పరీక్షలపై అమెరికాతో కలిసి.. - ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని ఖండించిన భారత్

ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్‌ ఖండించింది. ఈ మేరకు 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన చేసింది.

india on north korea Intercontinental Missile
భారత్ ప్రధాని మోదీ, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్

By

Published : Nov 23, 2022, 7:37 AM IST

ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను అమెరికా, మరో 12 దేశాలతో కలసి భారత్‌ ఖండించింది. సోమవారం సమితి భద్రతా మండలి సమావేశం అనంతరం ఈ 14 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా ఈ సంవత్సరం ఇంతవరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించింది. ఈ నెల 18న పరీక్షించిన ఖండాంతర క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపోయే సత్తా ఉంది. ఉత్తర అమెరికా ఖండంలో ఏ ప్రాంతాన్నైనా తాకగల ఈ క్షిపణి ఉత్తర కొరియా ఇంతవరకు పరీక్షించిన క్షిపణులన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షలను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయబోతున్నారనీ, ఆ ప్రకటన ప్రతిని భద్రతా మండలి సభ్యులకు అందిస్తానని మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా గ్రీన్‌ఫీల్డ్‌ తెలియజేశారు.

ఆ తరవాత కొద్ది గంటలకే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ రంగంలో దిగారు. తమ తాజా ఖండాంతర క్షిపణి పరీక్షలను ఐక్యరాజ్యసమితితో ఖండింపజేయాలని అమెరికా చూస్తోందనీ, దీనివల్ల ఆ దేశం భద్రతాపరంగా మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. భయంతో మొరుగుతున్న కుక్క అమెరికా అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details