తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పౌరసత్వాల్లో మనదే హవా!.. ఎంత మందికి ఇచ్చారంటే? - భారతీయులకు అమెరికా పౌరసత్వం

US naturalised citizens: అమెరికాలో కొత్తగా పౌరసత్వం పొందినవారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. మెక్సికో తర్వాత భారత్​కు చెందినవారికే పౌరసత్వాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ విషయం అమెరికా వెల్లడించిన గణాంకాల్లో స్పష్టమైంది.

u.s. citizenship for indian born child
India naturalised US citizens

By

Published : Jul 4, 2022, 6:52 AM IST

US citizenship for Indians: అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా.. భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా క్యూబా, ఫిలిప్పీన్స్‌, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి.

అమెరికాలో అక్టోబరు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈమేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. ‘2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. అమెరికా జులై 4న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్న నేపథ్యంలో ఈనెల 1 నుంచి 8వ తేదీ మధ్య కొత్తగా 6,600 మందికి పైగా పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details